కాసులు గలగల బతుకులు విలవిల | financial syndicate in kamareddy | Sakshi
Sakshi News home page

కాసులు గలగల బతుకులు విలవిల

Published Sun, Feb 16 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

financial syndicate in kamareddy

కామారెడ్డి, న్యూస్‌లైన్: కామారెడ్డి పట్టణంలో ఆర్థిక సిండికేట్ ఓ ఫ్యాషన్‌గా మారింది. పది నుంచి ఇరవై మంది స్నేహితులు కలిస్తే చాలు ఓ సిండికేట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. తలా కొంత డబ్బులు వేసుకుని ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ తదిత ర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ ఒక్క సిండికేటుతో సర్దుకుపోకుండా, మరిన్ని సిండికేట్‌ల లో సభ్యులు గా చేరుతు న్నారు. ఒక్కొక్కరూ ఒకటి, రెండు, పది వరకు సిండికేట్‌లలో సభ్యులుగా చేరుతున్నారు.

 పట్టణంలో ఈ సంస్కృతి దశాబ్దం క్రితం మొదలై పెద్దఎత్తున విస్తరించింది. ఇందు లో వ్యాపారులే కాకుండా, వృత్తిపనులవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వాములుగా ఫైనాన్స్, చిట్టీల వ్యాపారంలోనే ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. సభ్యులలో ఎవరో ఒకరు ఆర్థికంగా దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం సిండికేట్ మీదనే పడుతోంది.

 20 సిండికేట్‌లకు ఒక్కరే మేనేజర్
 స్థానికంగా ఓ వ్యాపారి 20 సిండికేట్‌లలో సభ్యునిగా ఉంటూ, వాటికి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు నెలకు రూ. రెండు లక్షలకు పైగా వేతనం అందుతుంది. ఇలా చాలా మంది ఫైనాన్సు భాగస్వాములు నిర్వహకులుగా ఉంటూ పెద్ద ఎత్తున వేతనాలు పొం దుతున్నారు. నిర్వహణలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ మేనేజరే పూర్తి బాధ్యుడుగా ఉంటాడు. డబ్బు నిల్వ ఉన్నా, అప్పులు ఇచ్చినా, అప్పులు వసూలు కాకున్నా అతనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ పరిస్థితి ఉన్నా భాగస్వాములకు వడ్డీ చెల్లించాల్సిందే. డబ్బుల రొటేషన్‌లో ఎదురయ్యే సమస్యలతో నిర్వాహకులు దివాళా తీసిన సందర్భాలు అనేకం ఉన్నా యి.

 పెట్టుబడిలో 4 శాతం
 సిండికేట్‌ల ద్వారా ఫైనాన్సు దందా నిర్వహించేందుకు భాగస్వాములలో నుంచి ఒకరు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. అతనికి పెట్టుబడి మొత్తంపై నాలుగు శాతం నెలనెలా వేతనం ఇస్తారు. పది మంది భాగస్వాములు కలిసి ఒక్కొక్కరు తక్కువలో తక్కువ రూ. లక్ష పెట్టుబడి పెడతారు. అందరి పెట్టుబడి రూ. 10 లక్షలు అ యితే మేనేజర్‌కు రూ. నాలుగు వేల వేతనం ఉంటుంది. తలా రూ. రెండు లక్షల పెట్టుబడి పెడితే రూ. ఎనిమిది వేలు, రూ. మూడూ లక్షలు పెట్టుబడి పెడితే రూ. 12 వేల వేతనం ఇస్తారు.

 ఫైనాన్సు ద్వారా చిట్టీలను నిర్వహిస్తారు. ఒక్కో భాగస్వామి రెండు చిట్టీలు కట్టాల్సి ఉంటుంది. భాగస్వామిగా ఉన్నవారు సొంతంగానో, లేదా తన స్నేహితులనో, బంధువులనో సభ్యులుగా చేర్పించాలి. చిట్టీ ఎత్తుకున్న సభ్యుడు ఏదేని పరిస్థితులలో చేతులెత్తేస్తే చేర్పించిన భాగస్వామి భరించాల్సిందే.

 అంతా జీరో దందానే
 ఫైనాన్సు దందాలో 90 శాతానికి పైగా జీరోగానే సాగుతున్నాయి. నిర్వాహకుడి అడ్డాగా చిట్టీల వ్యా పారం నడుస్తోంది. కొన్ని సిండికేట్‌లవాళ్లు సొంతంగా ఓ గదిని అ ద్దెకు తీసుకుంటే, మరికొందరు నిర్వాహకుడి ఇంటిలోనో, ఇతర స్థలాలలోనో ఫైనాన్సులు నిర్వహిస్తారు. మామూలు వ్యాపారాలు నిర్వహించే చోటా లెక్కలు నడుస్తాయి. కామారెడ్డిలో మూడు వం దలకు పైగా జీరో ఫైనాన్సులు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఏ ఒక్క సిండికేటు ద్వారా కూడా ఫైనాన్సులను  ప్రభుత్వ నిబంధనల ప్రకార ంగా నిర్వహిం చడం లేదని సమాచారం.

 నెల మొదటి వారంలో మీటింగులు
 సిండికేట్‌ల మీటింగులు ప్రతీ నెల మొదటి వారంలోనే సాగుతాయి. ఒకటో తారీఖున కొన్ని, ఉద్యోగులు భాగస్వాములుగా ఉంటే మొదటి ఆదివారం మీటింగులు ఉంటాయి. ఒక్కో వ్యక్తి పది, పదిహేను సిండికేట్‌లలో సభ్యులుగా ఉన్నపుడు ఒక్కో రోజు నాలుగైదు సిండికేట్ల మీటింగులకు హాజరు కావలసి ఉంటుంది. ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో, మధ్యాహ్న భోజన సమయంలో, సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయంలో వేరు వేరు మీటింగులు నడుస్తాయి. రాత్రి భోజనం (డి న్నర్-విందు, మందుతో) సమయంలో ఓ మీటింగు ఇలా ఒకటే రోజు మూడు, నాలుగు మీటింగులు హాజరయ్యేవారున్నారు.

 ప్రతీ నెల మొదటి వారంలో టిఫిన్ సెం టర్లు, వైన్సులు, బార ్లలో అడ్డగోలుగా వ్యాపారం సాగుతోంది. కొన్ని సిండికేట్లకు చెందిన వాళ్లు విం దులు, వినోదాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. కొందరు మాత్ర ం సామాజిక సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొంత సొమ్మును ఖర్చు చేస్తారు. నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే సిండికేట్లు ఎలాంటి నష్టాలు లే కుండా సాగుతుంటే, ఎంజాయ్ పేరుతో డబ్బులు దుబారా ఖర్చు చేసే సిండికేట్లలో సభ్యులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

 విహారయాత్రలతో భారీ ఖర్చులు
 కొన్ని సిండికేట్లకు చెందిన భాగస్వాములు ఏటా ఒకటి, రెండు పర్యాయాలు దేశ, విదేశాలలో విహార యాత్రలకు వెళ్తారు. పెద్ద ఎత్తున డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కొందరు దేశంలో ప్రము ఖ పుణ్య క్షేత్రాల దర్శనాలకు వెళితే, మరికొందరు ఊటీ, గోవాతోపాటు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ తదితర దేశాలకు వెళ్లి వచ్చేవారున్నారు.

 సక్సెస్‌లో కొన్ని సిండికేట్లు
 స్నేహితుల సిండికేట్లు కొన్ని విజయవంతంగా సాగుతున్నాయి. ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం, వృథా ఖర్చులు చేయకుండా వ్యవహరించే వాళ్లు ఆర్థికంగా నష్టపోవడం లేదు. విజయాల బాటలో ఉన్న సిండికేట్ సభ్యులు తోటి స్నేహితులకు చాలా విషయాలలో అండగా నిలిచిన సంఘటన లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement