బొండపల్లి (విజయనగరం) : వంటగ్యాస్ లీకై పెంకుటిల్లు దగ్ధమైన ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గొల్లుపాలెం గ్రామానికి చెందిన గొల్లు కిల్లమ్మ అనే మహిళ ఇంట్లో గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటన సమయంలో అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
కాగా ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న మూడున్నర తులాల బంగారం, రూ.20 వేల నగదు కాలి బూడిదైపోయాయి. సుమారు లక్షన్నర నష్టం వాటిల్లిన్నట్లు తెలిసింది. ఫైరింజన్లకు సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశాయి.
వంటగ్యాస్ లీక్ : ఇల్లు దగ్ధం
Published Fri, Aug 14 2015 8:38 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement