టెంకాయలోనాలుగు కొబ్బరి చిప్పలు
పెనుకొండ: టెంకాయలో రెండు చిప్పలు ఉండటం సర్వ సాధారణం. అయితే నాలుగు కొబ్బరి చిప్పలు ఉండటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా దాదులూరులో జరిగింది. వివరాలు.. పెనుకొండకు చెందిన కోగిర జయచంద్ర అనే వ్యక్తి బుధవారం దాదాలూరు పోతులప్పస్వామికి కొబ్బరి కాయ సమర్పించారు. అయితే అందులో నాలుగు చిప్పలు ప్రత్యక్షమయ్యాయి. ఈ కొబ్బరి చిప్పలను అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆసక్తిగా తిలకించారు.