బరువైన పేగు బంధం! | Heavy intestinal bonding | Sakshi
Sakshi News home page

బరువైన పేగు బంధం!

Published Tue, Jan 21 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

Heavy intestinal bonding

 అక్కడకు చేరిన వారంతా అయ్యో పాపం అన్నారు. అయితే ఆ పాపం ఆ పసిపాపదు కాదు. కర్కశంగా తుప్పలపై విసిరేసిన వారిది. ఆ పాపం అమ్మదే కాదు...అమ్మకు ఆ దుర్గతి పట్టించిన ఈ సమాజానిది. నిర్దయగా పాపను వదిలించుకున్న  వారి చేష్టలను చూసి నిశిరాత్రి సైతం భయపడి ఉంటుంది. వారి పైశాచికాన్ని కని పిశాచాలు సైతం నివ్వెరపోయి ఉంటాయి.  ఆ పాషాణ గుండెలను వీక్షించి బండలు మరింత బిగుసుకుపోయి ఉంటాయి. అయితే మానవత్వం ఇంకా మిగిలే ఉందని జరజాపు పేట ప్రజలు నిరూపించారు. పాపను బతికించేందుకు కృషి చేశారు.
 
 జరజాపుపేట (నెల్లిమర్ల), విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అర్ధరాత్రి పూట చంపేస్తున్న చలిగాలుల మధ్య ఆ పసిపాప ఎంతగా ఏడ్చిందో. అమ్మ స్పర్శ కోసం ఎంతగా తపించిపోయిందో. రాళ్లు, ముళ్లు ఒంటిని చీరేస్తుంటే ఎంతగా బాధపడిందో. ఆకలి తీరే దారి తెలీక, అమ్మ పాలు లేక ఎంత నరకయాతన అనుభవించిందో. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో వెచ్చగా తలదాచుకున్న ఆ శిశువుకు కన్నులు తెరవకముందే కష్టాలు మొదలయ్యాయి. మమకారానికి అర్థం తెలియని ఆ తల్లి కడుపులో పుట్టడం ఈ పాపకు శాపమైంది. లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లను ఆ తల్లి పాడుపడిన బావిలో పడేసింది. అన్నెంపున్నెం ఎరుగని పసిపాపను అర్ధరాత్రి పూట వదిలించుకుంది. ఆఆడపిల్ల ఏడు పువిన్న స్థానికులు పాపను ఆస్పత్రికి తరలించా రు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు స్థానికులకు సోమవారం లభ్యమైంది. 
 
 స్థానిక ఎరుబోతువీధి సమీపంలో పంట పొలాల్లో నీరులేని ఓ పా డుపడిన బావిలో ఈచిన్నారి దొరికింది. ఉదయం పొలాల వైపు వెళుతున్న ఓ వృద్ధురాలికి చిన్నారి ఏడుపు వినిపించింది. ఆమె స్థానికులకు సమాచా రం అందించడంతో వారంతా ఆశ్చర్యపోయి చు ట్టుపక్కల పరిశీలించగా బొడ్డుతాడు కూడా కోయ ని ఆడశిశువు బావిలో కనిపించింది. శిశువు శరీరమంతా చిన్నచిన్న దెబ్బలతో నిండిపోయింది. వీ రు గమనించడం ఏమాత్రం ఆలస్యమైనా చిన్నారి చనిపోయేదే. ఈ విషయం గ్రామమంతా పాకిపోవడంతో శిశువును చూసేందుకు జనం ఎగబడ్డా రు. చిన్నారి ఒళ్లంతా గాయాలైన వైనాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బొడ్డుతాడు కూడా కోయకుండా చిన్నారిని బావిలోకి విసిరేసిన వారిని, అంతా శాపనార్థాలు పెట్టారు. అనంతరం స్థానికులు అవనాపు సత్యనారాయణ, అవనాపు జీవనరావు, అతని తల్లి అవనాపు పాపయ్యమ్మ, పల్లా అప్పారావు మాక్సీ ఆటోలో శిశువును ఘోషాఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో చేర్పిం చా రు.
 
 అలాగే నెల్లిమర్ల సీడీపీఓ రమణాదేవికి స మాచారం అందించారు. ప్రస్తుతం చిన్నారి విజ యనగరంలోని ఘోషాఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శిశువు పరిస్థితి కాస్తంత విషమంగా ఉంద ని వైద్యులు చెప్పారు. బావిలో లభించిన శిశువు తమగ్రామానికి చెందినది కాదని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే  చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు, బాలిక సంరక్షణ విభాగం  అధికారులు ఘోషా ఆస్పత్రికి చేరుకుని శిశువు పరిస్థితి ఆరాతీశారు. శిశువుకు అవసరమైన రక్షణ కల్పిస్తామని చైల్డ్‌లైన్ 1098 సంస్థ కోఆర్డినేటర్ రాజారావు, డీసీపీయూ పీఓ నాగరాజు తెలిపారు.
 
 విషమంగా ఉంది
 శిశువును నూతిలో పడేయడంతో తలకు, శరీరంపై గా యాలయ్యాయి. పల్స్‌రేటు చాలా తక్కువుగా ఉంది. ఆస్పత్రికి 9:30గంటల సమయంలో తీసుకుని వచ్చా రు. వచ్చిన వెంటనే వైద్యం చేశాం. బొడ్డు కోయకపోవడంవల్ల రక్తస్రావం అధికంగా అయింది. అవసరమై న వైద్యంచేశాం. ప్రస్తుతానికి శిశువు పరిస్థితి విషమంగానే ఉంది.   -బి.రవీంద్రబాబు, ఎస్‌ఎన్‌సీయూ డాక్టర్ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement