అనకాపల్లి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాని ఇచ్చే అంశం విభజన చట్టంలో లేదని కేంద్రప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చ ట్ట సవరణ చేసి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన కోరారు.
2014 ఫిబ్రవరి 20 నాటి ప్రధాని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని లోక్‌సభలో చేసిన హామీని నేటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. హోదా కల్పించేందుకు చేసే చట్టసవరణ రాజ్యాంగ సవరణ కాదా అన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేయాలనుకుంటే కేవలం ఒక గంట వ్యవధిలో చట్టాన్ని తయారు చేయవచ్చన్నారు. పార్లమెంట్ సభ్యులందరూ సభను దిగ్భం ధించి హోదా ను సాధించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు.
‘ప్రత్యేక హోదాపై కేంద్రం మాటలు విడ్డూరం’
Published Sun, May 8 2016 3:08 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement