కేరళ హైకోర్టుకు జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ బదిలీ!  | Justice SV Bhatt to Kerala High Court | Sakshi
Sakshi News home page

కేరళ హైకోర్టుకు జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ బదిలీ! 

Published Sat, Jan 19 2019 9:34 AM | Last Updated on Sat, Jan 19 2019 9:34 AM

Justice SV Bhatt to Kerala High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ను కేరళ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని జస్టిస్‌ ఎస్‌వీ భట్‌కు సైతం సుప్రీం కోర్టు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బదిలీకి సంబంధించిన అధికారిక తీర్మానం త్వరలో వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ, మరికొందరికి పదోన్నతి కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement