ఆర్టీవో ఉద్యోగిపై దూసుకెళ్లిన లారీ, మృతి | Lorry hits RTO employee death at Renugunta RTO check post | Sakshi
Sakshi News home page

ఆర్టీవో ఉద్యోగిపై దూసుకెళ్లిన లారీ, మృతి

Published Mon, May 18 2015 4:10 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

Lorry hits RTO employee death at Renugunta RTO check post

తిరుపతి: రేణిగుంట ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద సోమవారం దారుణం జరిగింది. ఓ ఆర్టీవో ఉద్యోగిపై లారీ దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతిచెందాడు. తనిఖీ కోసం ఓ లారీని ఆపడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా  చెక్ పోస్టు దగ్గర లారీని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా, లారీ డ్రైవర్ ఢీకొట్టాడు.లారీ డ్రైవర్ ఘాతుకానికి ఆ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు సాంబ ఆర్టీవో చెక్ పోస్టు దగ్గర కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆర్టీవో ఉద్యోగిపై దూసుకెళ్లిన లారీ ఎర్రచందనానికి సంబంధించినది కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీ కోసం పోలీసులు కాగా, సాంబ మృతిపై న్యాయం చేయాలని రేణిగుంట చెక్ పోస్టు వద్ద బాధితులు ధర్నాకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement