విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతవరణం కేంద్ర తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడు పైనే ఉంటుందని వాతావరణ అధికారులు స్పష్టం చేయగా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ఒంగోలుపై ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
సోమ, మంగళవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతవరణ కేంద్ర పేర్కొంది.