మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: తమ అభిమాన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బెయిల్‌పై రావడంతో అభిమానులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు మంగళవారం రెండోరోజు జిల్లావ్యాప్తంగా సంబరాలు జ రుపుకున్నారు. బాణాసంచా కాల్చుతూ..స్వీట్లు పంచిపెడుతూ ఆ నందం పంచుకున్నారు. పలుప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. 485 రోజుల తరువాత జనంలోకి వస్తున్న తమ అభిమాన నేతను స్వయంగా చూసేందుకు పార్టీ శ్రేణులు జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో తరలివెళ్లారు.
కోర్టు తీర్పువెలువడుతుందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ సభ్యురాలు వం గూ రు బాలమణెమ్మ తదితర నేతలు సోమవారం నుంచి హైదరాబాద్‌లోనే మకాంవేశారు. అలాగే పలువురు జిల్లానేతలు మంగళవా రం ఉదయమే హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా కేంద్రం నుంచి పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ ఆర్.రవిప్రకాశ్, నేతలు మహ్మద్ వాజిద్, మహమూద్ అలీ సనా, కురుమూర్తి, మిట్టమీది నాగరాజు, జోగులు, తిరుపతి నాయక్, సతీష్‌గౌడ్, శ్రీకాంత్ తది తరులు హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ అంశంపైనే రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేకే 16 నెలల పాటు జైల్లో పెట్టడం పాలకుల కుట్రలేనని దుయ్యబడుతున్నారు. అందుకు కాంగ్రెస్, టీడీపీలు తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా..
అలంపూర్ నియోజకవర్గంలోని మానపాడు, శాంతినగర్‌లో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికొక రు స్వీట్లు పంచుకున్నారు. అమరవాయి, ఉండవెల్లిలో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. అలాగే శాంతినగర్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు రోడ్లపైకి చేరి బాణాసంచాలు కాల్చుతూ మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నచింతకుంట మండలకేంద్రంలో పాటు దుప్పల్లి, అల్లీపురం గ్రామా ల్లో ర్యాలీలు నిర్వహించారు. జై జగన్..జైజై జగన్ అంటూ ని నాదాలతో హోరెత్తించారు. కొత్తకోట మండలం నాచారంపే ట తండా సమీపంలో ఉన్న దర్గాలో 101 కొబ్బరికాయలు కొ ట్టి తమ అభిమానం చాటుకున్నారు. కోడేరు మండలకేంద్రం లో జగన్ అభిమానులు బాణాసంచా కాల్చారు. పురవీధుల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మండలకేంద్రంలో వై ఎస్‌ఆర్ సీపీ నేతలు స్వీట్లు పంపిణీచేశారు. కాంగ్రెస్, టీడీపీల కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మక్తల్ మండలంలో ని అనుగొండ, కర్ని, మాద్వార్, జక్లేర్, పారేవుల, అంకెన్‌పల్లి, దాన్‌పల్లి, సామన్‌పల్లి, గుడిగండ్ల, పస్పుల తదితర గ్రామాల్లో వైఎస్‌ఆర్ సీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాల్చి మి ఠాయిలు పంపిణీచేశారు. అచ్చంపేట లో వైఎస్‌ఆర్ సీపీ మ హిళా విభాగం జిల్లా కన్వీనర్ శారద ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జగన్‌ను చూసేందుకు పార్టీ శ్రేణుల్లో ప్రత్యేకవాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. గద్వాల నియోజకవర్గంలోని ఇటిక్యాల, గద్వాల, ధరూర్, మల్దకల్ మండలకేంద్రాల్లో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జడ్చర్లలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్చర్ల క్రాస్‌రోడ్డులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కల్వకుర్తి, కడ్తాల, కొడంగల్, నారాయణపేట, ధన్వాడ, వనపర్తి, నాగర్‌కర్నూల్, తాడూరు తదితర ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు.
ఉప్పొంగిన అభిమానం
Published Wed, Sep 25 2013 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement