మావోయిజం వెలుగులో.. అమరుల యాదిలో | Maoism in the light .. Martyrs bunk beds | Sakshi
Sakshi News home page

మావోయిజం వెలుగులో.. అమరుల యాదిలో

Published Mon, Jan 13 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

మావోయిజం వెలుగులో.. అమరుల యాదిలో

మావోయిజం వెలుగులో.. అమరుల యాదిలో

  •     విప్లవ స్ఫూర్తినిస్తూ ముగిసిన విరసం మహాసభలు
  •      చివరి రోజు కవిగాయక సభ, సెమినార్లు
  •      కవుల కవితాగానం
  •      రచయితల పుస్తక పరిచయం
  •  
    హన్మకొండ కల్చరల్ /సుబేదారి, న్యూస్‌లైన్: విప్లవాల పురిటిగడ్డ అయిన వరంగల్‌లో నిర్వహించిన విప్లవ రచయితల సంఘం (విరసం) 24వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. తొలిరోజు శనివారం ఆదివాసీ ఉద్యమాలు.. స్వపరిపాలనపై సదస్సు, ర్యాలీ, బహిరంగ సభలు జరిగాయి. రెండో రోజు ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో కవిగాయక సభ, కాళోజీ సాహిత్యం తాత్వికత, అభివృద్ధి భావజాలం, విచ్ఛిన్నమవుతున్న మనిషి అంశాలపై జరిగిన సెమినార్లలో వక్తలు దర్భశయనం శ్రీనివాసచార్య, ఎన్.వేణుగోపాల్ మాట్లాడారు.

    విప్లవోద్యమ మేధావి మహిత అనే బుక్‌లెట్‌ను వరవరరావు ఆవిష్కరించారు. విరసం సభలకు క్రాంతి జనతన సర్కారు పంపిన సందేశాన్ని వరవరరావు చదివి వివరించారు. లక్ష్మి అలియాస్ మహిత విప్లవోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసింద ని... జీవితాంతం విప్లవం కోసం కృషి చేసిందని... లక్ష్మి, శోభ తనకు ఇద్దరు బిడ్డల్లాంటివారని వరవరరావు అన్నారు.

    ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే...
     హృదయంతో కవిత్వం చెప్పిన కవి కాళోజీ : దర్భశయనం శ్రీనివాసచార్య

     కర్షక కర్రులు కదిలిన్నాళ్లు వ్యవసాయక దేశం అని హృదయంతో కవిత్వం చెప్పిన కవి కాళోజీ అని కవి దర్భశయనం శ్రీనివాసచార్య అన్నారు. అంబేద్కర్ భవన్‌లో ‘కాళోజీ సాహిత్యం.. తాత్వికత’అంశంపై విరసం సభ్యుడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  ఒక మానవుడు మరొకరిని మానవుడుగా చూడడమే మానవత అని తాత్విక దృక్పథంతో కాళోజీ చెప్పారని గుర్తు చేశారు. నేను, నా భావన లేని మన భావన అనునది కాళోజీ సమభావన అని  పేర్కొన్నారు. పీవీ నరసింహరావులాంటి వాళ్ల పేరుతో సంబోధించి నామవాచకాల రూపంలో కవిత లు రాసిన గొప్పకవి కాళోజీ అని... ఆయన కవితల్లో సర్వనామాలు తక్కువని పేర్కొన్నారు. కాళోజి ప్రజాస్వామికవాది అని.... చివరి శ్వాసవరకు ప్రజల కోసం వారి తరఫున పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ గూర్చి చెబుతూ దేశాల పునర్నిర్మాణం లక్షల సార్లు జరుగుతదని కాళోజీ  అన్నారని ఆయన ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఆకాంక్షించడానికి ఆయన చెప్పారు.

     కవిగాయక సభలో...

     మనిషి ఒంటరి వాడయ్యాడని... కొనుగోలుదారుడిగా, అమ్మకందారుడిగా మారిపోతున్నాడని.... అందుకే అస్థిత్వాల ప్రాధాన్యం పెరిగిపోతున్నదని వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశా రు.  పీపుల్స్‌వార్ నాయకుడు కవి చిర్ర సదానందం అలియాస్ కౌముది కవితావేదికగా జరిగిన కవిగాయక సభను గాయకుడు సుదర్శన్, విరసం సభ్యుడు అరసవెల్లి కృష్ణ, కవి వడ్డెబోయిన శ్రీనివాస్ నిర్వహించారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కళ్యాణ్‌రావు కవిత చదివి వినిపించారు. ఆయనతోపాటు 30 మంది వరకు కవితలు చదివి వినిపించారు.

    ఈ సందర్భంగా పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కలింగసీమ, ప్రజా సమస్యల పోరాటాలు పుస్తకాన్ని పరిచయం చేసిన విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళింగ, రాయలసీమ ప్రాంతాలు కూడా రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి దోహదకారి అవుతుందన్నారు. కృష్ణాభాయి రాసిన సాహిత్య సమాలోచన పుస్తకాన్ని పరిచయం చేసిన నల్లూరి రుక్మిణి మాట్లాడుతూ ఆరేళ్లుగా ఉద్యమకారుల అభిప్రాయా లు, చర్చలు ప్రత్యక్షంగా పరిచయం చేస్తూ రాసిన విషయాలు అందరూ చదువదగినదిగా ఉందన్నారు.

    ప్రజాస్వామ్య తెలంగాణ చారిత్రక పత్రాలు పుస్తకాన్ని పరిచయం చేసిన మెట్టు రవీందర్ మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ అంటే మన దేశం నుంచి తెల్లవాళ్లు పోయి నల్లవాడి పాలన వచ్చినట్లేనన్నారు. సౌర్వభౌమాధికారంతో ప్రజాస్వామిక తెలంగాణకావాలన్నారు. ముంద్రస్థాయి యుద్ధం పుస్తకాన్ని పరిచ యం చేసిన రివేరా మాట్లాడుతూ వార్తల్లో ప్రస్తావించడం ద్వారా కూడా ఉద్యమాన్ని నిశ్శబ్దంగా దెబ్బ తీస్తున్న ప్రయత్నాలను వివరించారు.  
     
    మరిన్ని పుసకావిష్కరణలు

     పోరాట జలపాతం, ఆదివాసీ పోరాట కథలు పుస్తకాలను పులి అంజయ్య తల్లి సామనర్సక్క, పోలెం సుదర్శన్‌రెడ్డి సహచరి భారతి... అల్లం రాజయ్య రాసిన వసంత గీతం నవలను గంగారం తల్లి లక్ష్మి , నల్లా ఆదిరెడ్డి(శ్యాం) అన్న సుధాకర్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలోని ప్రతి అడుగు విశ్లేషణాత్మకంగా నవలగా రాశాడ ని... సాహిత్య చరిత్రలోనే ఇదొక అరుదైన ప్రక్రియ అని అన్నారు. నందిని సిధారెడ్డి కవితా సంపుటి ఇక్కడి చెట్ల గాలి పుస్తకాన్నిపరిచయం చేసిన వి.చెంచయ్య  మాట్లాడుతూ సాహిత్యేతర రంగాలకు చెందిన వారు కూడా చదవాల్సిన పుస్తకమన్నారు.

    పిల్లనగ్రోవి తుఫా న్ పుస్తకాన్ని వడ్డెబోయిన శ్రీనివాస్ పరిచయం చేశారు. నేను తెలంగాణోన్ని పుస్తకాన్ని పరిచయం చేసిన వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్ష కేవలం రాష్ట్ర ఏర్పాటు కాదు... తెలంగాణ ప్రజల స్వాభిమాన ఆకాంక్ష అన్నారు. ఆకుల భూమ య్య చివరి ప్రసంగాన్ని ఆవిష్కరించిన విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ మాట్లాడుతూ వస్తున్నది సరిహద్దుల తెలంగాణ మాత్రమేనని... వర్గపోరాటం ద్వారా వచ్చేదే నిజమైన తెలంగాణ అని అన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement