అందమైన దవాఖాన | No ambulance in government hospital | Sakshi
Sakshi News home page

అందమైన దవాఖాన

Published Wed, Dec 11 2013 4:33 AM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM

No ambulance in government hospital

 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ఆస్పత్రికి రోజూ దాదాపు వెయ్యి మంది వరకు రోగులు వస్తుంటా రు. అత్యవసర కేసులు 25 నుంచి 30 వర కు ఉంటాయి. వీరికి చాలా వరకు ఇక్కడ సేవలు అందించలేకపోతున్నారు. పరిస్థితి విషమించినవారిని రాజధానికి పంపిస్తున్నారు. వారిని తీసుకెళ్లడానికి అంబులెన్స్ మాత్రం అందుబాటులో లేదు. ఒక అంబులెన్‌‌స మరమ్మతులకు నోచుకోక మూలన పడితే, మరొకటి వైద్యు ల సేవలో తరిస్తోంది. జిల్లా అధికారులు ఉన్న చోటే ఈ పరిస్థితి ఉంటే, జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నాతాధికారులు పలుమార్లు ఆస్పత్రిని తనిఖీ చేసినా, అంబులెన్‌‌స గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
 
 మూలనపడిందొకటి 
 మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రామాకేర్ సెంటర్ మం జూరైంది. దీని కోసం కేంద్రం 88 లక్షల రూపాయల నూ విడుదల చేసింది. జాతీయ, ప్రధాన రహదారులపై జరిగే ప్రమాదాలలో గాయపడినవారికి తక్షణ సహాయం అందించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దీని లో భాగంగా ఆస్పత్రికి అత్యాధునిక అంబులెన్స్ కూడా మంజూరైంది. ఇందులో నలుగురు రోగులను ఒకేసారి తీసుకుపోయే వీలుంది. నెలల కొద్దీ ఆలోచించిన అధికారులు ఇప్పటికీ ట్రామాకేర్ సెంటర్‌ను మాత్రం ప్రారంభించలేదు. దీంతో అంబులెన్‌‌స వృథాగా పడి ఉంది. అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. గతంలో ఆస్పత్రి అభివృద్ధి సమావేశం జరిగినపుడు అప్పటి జిల్లా కలెక్టర్ వరప్రసాద్  అంబులెన్స్‌ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అప్పుడు వారు హడావుడి సృష్టించారు తప్ప అంబులె న్స్ మాత్రం బయటకు తీసుకు రాలేదు. 
 
 దండుకుంటున్న ప్రైవేటు అంబులెన్స్‌లు
 ఈ పరిస్థితిని ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు దండుకుంటున్నారు. పేద రోగులను కారుణ్యం లేకుండా దోచుకుంటున్నారు. ఒక్క అత్యవసర కేసును హైదరాబాద్ తీసుకుపోవడానికి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు వసూ లు చేస్తున్నారు. ఇంత డబ్బు చెల్లించలేనివారు అందుబాటులో ఉన్న వైద్య సేవలతోనే సరిపెట్టుకుంటున్నా రు. దీంతో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నా రు. కొందరు అప్పులు చేసి కిరాయిలు చెల్లిస్తున్నారు. ప్రైవేటు అంబులెన్స్‌లు ఇష్టానుసారంగా దండు కుం టున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అంబులెన్స్‌లు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించినా నేటికీ అమలులోకి రాలేదు. 
 
 తక్షణమే ఏర్పాటు చేయాలి
 ఆస్పత్రిలో తక్షణమే అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలి. పేద రోగులు అంటే అధికారులకు అలుసుగా ఉన్నట్టుంది. అత్యవసరం వస్తే ప్రాణాలు పోవల్సిందేనా? అట్లయితే ప్రభుత్వాలు ఎందుకు ఉన్నట్లు? వైద్యులు లేక ఇబ్బందులు ఉన్నాయనుకుంటే, అంబులెన్స్ కూడ లేదు. ఇంత అన్యాయమా..ఇప్పటికైనా ఆలోచించాలి
 - గాడిబాయి, సిర్పూర్ తండా 
 
 పేరుకే పెద్దాస్పత్రి
 ఇంత పెద్ద ఆస్పత్రి కట్టిండ్రు. ఇందులో డాక్టర్‌సాబ్‌లు లేకపాయిరి. ఎప్పుడు చూసిన హైదరాబాద్ పొమ్మంటరు. తీసుకుపోదామంటే అంబులెన్స్ కూడ లేదాయె. బయటవాళ్లను రమ్మంటే వేల రూపాయలు అడుగుతండ్రు. ఇగ మా పాణాలు ఎట్ల కాపాడుకోవాలె. అధికార్లు పట్టించుకోవాలె.  
 -లక్ష్మి , తిర్మన్‌పల్లి 
 
 ఇబ్బందులు నిజమే
 ఆస్పత్రికి అంబులెన్స్ లేకపోవడంతో ఇబ్బం దులు వస్తున్న మాట నిజమే. త్వరలో అంబులెన్సును ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు అంబులెన్స్‌ల దోపిడీని అడ్డుకుంటున్నం. అంబులెన్స్‌ల ఏర్పాటు గురించి ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం 
 - భీంసింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement