అయ్యో!
అనంతపురం.. రుద్రంపేట బైపాస్... శనివారం సాయంత్రం 6.27 గంటలు... రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి... అందులో కొందరు రోడ్డు పక్కన ఉన్న ఓ శునకం మాంసపు ముద్దను తీసుకెళ్తుండడం చూశారు. ఏంటా అని దగ్గరికెళ్లే సరికి ఒక్కసారిగా షాక్.. శిశువును సగ భాగం తినేసిందా శునకం. ఈ హృదయ విదారక ఘటనను చూసిన వారి మనసు చలించిపోయింది. ఆ శరీర భాగాన్ని కుక్క బారి నుంచి కాపాడారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ‘వాళ్లకు చేతులెలా వచ్చాయో’ అంటూ ఆవేదన చెందారు.
ఈ ఘటనకు కారణమేదైనా...ఈ పాపకు అన్నప్రాసన కాక ముందే నూకలు చెల్లాయి.. కారుకులెవరైనా...కుక్క నోటిలో ఓ చిన్నారి మాంసపు ముద్దయింది. కనీసం మనమైనా...ఈ నిర్భయ భారతంలో నిర్దయులను నిలదీద్దామా?లేక నిర్లక్ష్యమా వర్ధిల్లు అని నినదిద్దామా?? - అనంతపురం క్రైం