పాతకక్షలతో ఇంత దారుణమా! | One Person cut The tongue with old bumps | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో ఇంత దారుణమా!

Published Thu, Apr 27 2017 10:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

పాతకక్షలతో ఇంత దారుణమా! - Sakshi

పాతకక్షలతో ఇంత దారుణమా!

నెల్లూరు: పాతగొడవలను మనస్సులో పెట్టుకొని ఓ వ్యక్తి కత్తితో నాలుకను కోసిన సంఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల  సమాచారం మేరకు.... కడప జిల్లా గంగవారిపల్లి గ్రామానికి చెందిన డి. బాలకొండారెడ్డి గత కొంతకాలంగా నెల్లూరులో క్యాటరింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతనికి నగరానికి చెందిన నారాయణకు పని విషయమై వివాదం ఉంది. పలుమార్లు గొడవలుపడ్డారు. ఈనేపథ్యంలో ఈనెల 25వ తేది రాత్రి లస్సీసెంటర్‌లోని సాయికేఫ్‌ వద్ద బాలకొండారెడ్డి ఉన్నాడు. అదే సమయంలో అక్కడ వున్న నారాయణ పాతకక్షలను మనస్సులో పెట్టుకొని కత్తితో నాలుకను కోశాడు.  తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు ఒకటోనగర పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement