పెన్షన్ టెన్షన్ | Pension Tension | Sakshi
Sakshi News home page

పెన్షన్ టెన్షన్

Published Fri, Sep 19 2014 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

పెన్షన్ టెన్షన్ - Sakshi

పెన్షన్ టెన్షన్

 సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయకపోగా వారి మధ్య చిచ్చు రేపుతోంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇటు పింఛన్‌దారులు ఆందోళ న చెందుతుండగా....అటు పల్లెలు ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత సర్కార్ చేస్తోంది. రాజకీయ పెత్తనం కోసం, నాయకుల హవా కొనసాగేందుకు జీఓ నంబర్.135ను తీసుకొచ్చింది. ప్రస్తుత పింఛనుదార్ల అర్హత పరిశీలన, కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ పేరు తో గ్రామాల్లో ఏకపక్ష రాజకీయానికి తెరలేపింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందే ఇదే తరహాలో జీఓ నంబర్ 101ని తెచ్చింది.
 
 ప్రలోభ పెట్టేలా ఎన్నికల  ముందు ఆర్థికాభివృద్థి పథకాలను తెరపైకి తీసుకురావడమే కాకుండా వాటిని తమ నాయకుల ద్వారా మంజూరు చేయించేలా పథక రచన చేసింది. ప్రజలకు లబ్ధి చేకూర్చడంతో పాటు నాయకులకు పరపతి పెంచినట్టు అవుతుందని  భావించింది. కానీ కాంగ్రెస్ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మలేదు. ఎంత చేసినా తిప్పికొట్టారు. ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. అధికారంతంలో వేసిన ఎత్తుగ డతో కాంగ్రెస్ చిత్త అయ్యిందన్న విషయం తెలిసిన్పటికీ ప్రస్తుత టీడీపీ సర్కార్ కూడా అదే సూత్రా న్ని పాటిస్తోంది. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పినట్టుగానే తమ నాయకుల పెత్తనం సాగేలా తాజాగా పింఛనుదార్ల అర్హత పరిశీలన, కొత్త దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రత్యేక జీఓ జారీ చేసింది. ఇప్పుడా జీఓ గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది.
 
 పింఛనుదార్ల అర్హత పరిశీలన, కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎవరెవరు సభ్యులగా ఉండాలన్నదానిపై 17వ తేదీన జీఓ జారీ చేసింది. గమ్మత్తు ఏంటంటే ఆ జీఓ రాకముందే ఆ కమిటీ సభ్యుల నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దీన్ని బట్టి ఎలాంటి పథకంతో టీడీపీ సర్కార్ ముందుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే కమిటీల్లో సభ్యుల నియామకం కూడా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయింది. సభ్యుల ముసుగులో తమ పార్టీ నాయకులనే లోపాయికారీగా తొలుత నియమించేసి, అధికారికంగా తర్వాత ప్రకటించింది. ఇందులో అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. అందులో గ్రామ పంచాయతీ స్థాయి కమిటీలో సర్పంచ్ అధ్య క్షునిగా, ఎంపీటీసీ ఒకరు, స్వయం సహాయల సంఘాల నుంచి ఇద్దర్ని, సామాజిక ఔత్సాహికుల నుంచి ఇద్దర్ని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని సభ్యులుగా నియమించాల్సి ఉంది.
 
 మున్సిపాలిటీలో వార్డు స్థాయి కమిటీలో కౌన్సిలర్ అధ్యక్షునిగా, స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు, సామాజిక ఔత్సాహికుల నుంచి ఇద్దరు, బిల్ కలెక్టర్ ఒకరు, మండల స్థాయి కమిటీ కొచ్చేసరికి ఎంపీపీ అధ్యక్షునిగా, సభ్యులుగా జెడ్పీటీసీ ఒకరు, ఎంపీటీసీల నుంచి ఇద్దరు, సర్పంచ్‌ల నుంచి ఇద్దరు, ఎంపీడీఓను నియమించాలి. మున్సిపాల్టీ స్థాయి కమిటీ లో  చైర్మన్ అధ్యక్షునిగా, కౌన్సిలర్ల నుంచి ఒకరు, సామాజిక ఔత్సాహిక వేత్తల నుంచి ముగ్గురు, కమిషనర్‌ను సభ్యులుగా నియమించాలి. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రి, కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీ మినహా  గ్రామ స్థాయి కమిటీలో నలు గుర్ని, మున్సిపాల్టీ వార్డు కమిటీల్లో నలుగుర్ని, మండల కమిటీల్లో నలుగుర్ని, మున్సిపాల్టీ కమిటీల్లో నలుగుర్ని నామినేటేడ్‌గా నియమించాల్సి ఉంది. ఇంకేముంది స్థానిక సంస్థల అభిప్రాయం తీసుకోకుండా  టీడీపీ నాయకుల్నే సభ్యులుగా  సర్కార్ యంత్రాంగం ఏకపక్షంగా నియమించేసింది. దీనిపై గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమ ఆవేదన, ఆందోళన తెలియజేస్తున్నారు. గుర్లలో గురువారం ఇదే విషయమై టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
 
 కమిటీలకు పచ్చ రంగు
 మొత్తానికి కమిటీల్లో టీడీపీ నాయకుల ఆధిపత్యం ఎక్కువైంది. పింఛనుదార్ల అర్హత పరిశీలన, కొత్త దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో రాజకీయం పులుముకుంది. ప్రస్తుత పింఛనుదారుల్లో ఎవర్ని ఉంచా లో? ఎవర్ని తీసేయాలన్న  వ్యవహారం ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. అలాగే కొత్తగా మంజూరు చేసే అధికారం కూడా పరోక్షంగా ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం అప్పగించింది. ఇంకేముంది తమ పార్టీకి పనిచేయలేదన్న కంటగింపుతో ఏదొక మెలిక పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ పరిశీలన కార్యక్రమం శుక్ర, శనివారాల్లో (19,20వ తేదీల్లో) జరగనుంది. 21న కొత్త దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ఇప్పటికే గ్రామాల్లో పింఛన్ల ఏరివేసే విషయంలో టీడీపీ నేతలు సంకేతాలివ్వడంతో గ్రామాల్లో అలజడి మొదలైంది. కమిటీల ఏర్పాటు దగ్గరి నుంచి ఎరివేత వ్యవహారం వరకు గ్రామాల్లో చిచ్చు రేగింది. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియదు గాని ప్రస్తుతం పల్లెల్లో ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోంది.
 
 కమిటీల నియామకంపై రచ్చ
 పింఛన్ల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కమిటీల నియామకంపై గ్రామాల్లో అప్పుడే గొడవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో గురువారం గుర్ల, బొబ్బిలి, మెరకముడిదాం మండలాల్లో అధికార పార్టీ నాయకులతో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నాయకులు వాగ్వాదాానికి దిగారు. బొబ్బిలి మండలంలో కమిటీల ఏర్పాటుపై ఎంపీడీఓ వివరిస్తుండగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చింతాడ, అలజంగి సర్పంచులు చింతాడ జయప్రదీప్‌కుమార్, డాక్టర్ బెవర సూర్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులను ఏ ప్రాతిపదికన గుర్తించారని, ప్రభుత్వ విధానం ఏమిటని ప్రశ్నించారు.
 
 దీనిపై ఎంపీడీఓ వివరణ ఇస్తుం డగా టీడీపీ నాయకులు అడ్డుతగిలారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. తాము కమిటీపై సందేహాలు వ్యక్తం చేశామని, పింఛనుదారులకు తాము వివరణ ఇవ్వాల్సి ఉం టుందని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చెబుతుండగా ఎంపీడీఓ అరుంధతీదేవి వివరణ ఇచ్చారు. అలాగే గుర్ల మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కమిటీల ఏర్పాటుపై సమాచార హక్కు చట్టం ద్వారా కోర్టును ఆశ్రయి స్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. మెరకముడిదాం, ఎల్.కోట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement