మచిలీపట్నం: కృష్ణాజిల్లా ముఖ్యకేంద్రమైన మచిలీపట్నం పట్టణంలోని పలు కాలనీల్లో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నుంచి సోదాలు నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ, టెంపుల్ కాలనీలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. అలాగే పలు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని... స్టేషన్కు తరలించారు.
పోలీసుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో పట్టణంలో దొంగలు పలు నివాసాలే లక్ష్యం చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దాంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.