నేర నియంత్రణలో పోలీసుల పనితీరు భేష్
‘నేనూ ఒకప్పడు పోలీసు బాధితుడ్నే.. ఓ కేసు విషయంలో నేను, మా నాన్నతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి ఎస్సై పట్టించుకోలేదు. పైగా మాపై దౌర్జన్యం చేసిన వారితో చేతులు కలిపారు. మాపై ఒత్తిడి తెచ్చారు. చేతులు కట్టుకుని నేను, మా నాన్న పోలీస్‌స్టేషన్ బయటే నిల్చుండిపోయాం. మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో సామాన్యులు ఎలా ఇబ్బంది పడతారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను’..
..ఈ మాటలన్నది ఎవరో కాదు., సాక్షాత్తు జిల్లా పోలీస్ బాస్, ఎస్పీ ఎ.ఎస్.ఖాన్.
ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని భావిస్తున్నా. అదే మా సిబ్బందికి తరచూ చెబుతున్నా.. నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఓరియంటేషన్ ఆఫ్ పోస్కో (పిల్లలపై జరుగుతున్న దాడులు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు- పిల్లల సంరక్షణ చట్టం) యాక్ట్ 2012’పై సిబ్బందికి అవగాహన కార్యక్రమం సందర్భంగా బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
శ్రీకాకుళం అర్బన్ : నేర నియంత్రణలో పోలీ సుల పనితీరు బాగుందని ఎస్పీ ఏఎస్ ఖాన్ అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో నింది తులు తాము తదుపరి విచారణ నిమిత్తం కోర్టులో సమయం ప్రకారం హాజరవుతామని లిఖితపూర్వక హామీ ఇస్తే అరెస్టు చేయొద్దని నిబంధన ఉందని ఆయన తెలిపారు. ఏ.బీ.సీ. డీ క్లాజుల్లో పరిమితి దాటి ప్రవర్తించినా, సాక్షుల్ని ప్రభావితం చేసినా, నిందితుడు తప్పించుకునే అవకాశం ఉన్నా, అతిగా ప్రవర్తించిన సందర్భాల్లో మాత్రమే అరెస్టు చేయమని సిబ్బందికి చెబుతున్నామన్నారు.
బాలికలపై దాడులు అమానుషం
బాలికలు, మహిళలుపై దాడులు జరగడం దారుణం. ఇందుకోసం ప్రభుత్వం చట్టాన్ని పటిష్టం చేసింది. ‘చైల్డ్ వెల్ఫ్‌ర్’ విభాగ సిబ్బందితో కలిసి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. తుపాన్ సమయంలో రెవెన్యూతోపాటు ఇతర విభాగాలతో పోలీసు యంత్రాంగం కలిసి పనిచేసిందన్నారు. ఇందుకు సీఎం కూడా అభినందించారన్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఏదైనా ఒక సంఘటన జరిగినపుడు వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర అమోఘమన్నారు.మూడు నెలల క్రితం జరిగిన కొత్తూరు ఏటీఎం కేసు, పాతపట్నం, సంతకవిటి, సోంపేట, మందసలలో దొంగతనాలు జరిగాయి. సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఒడిశా దొంగలు అక్కడే తిష్టవేసి పని కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిపై నిఘా ముమ్మరం చేశామని ఎస్పీ అన్నారు.
జిల్లాలో మద్యం బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని, వీటి ని రద్దు చేసినప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వీటిపై ఎక్సైజ్‌శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికడతామన్నారు. నివగాం, పైడిభీమవరం, చిలకపాలెం, కంచిలి ప్రాంతా ల్లో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు డీఎస్పీని నియమించామన్నారు. ఎస్పీ కార్యాలయంలో సెంట్రల్ కంప్లెయింట్ సెల్ (సీసీసీ) ఏర్పాటు చేశామన్నారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లో సిబ్బంది, ప్రజలు సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. 18యేళ్లలోపు మహిళలపై దాడు లు జరుగుతున్నందున కొత్తగా ‘యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సెల్’ ఏర్పాటు చేసి బాధితులకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. కేసుల పెండింగ్ తగ్గించేందుకు కోర్టు మాని టరింగ్ సెల్ ప్రారంభించామన్నారు. ఆటోలు పెరిగి పోవడం వల్లే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.