నెల్లూరు (టౌన్) : జిల్లాలో యథేచ్ఛగా విద్యా వ్యాపారం సాగుతోంది. నిబంధనలుకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు నడుపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. విద్య పేరుతో రూ.కోట్లు దండుకుంటున్నారని ఫిర్యాదులందుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఓ కార్పొరేట్ స్కూల్ డిపాజిట్ల వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల దందాపై ప్రత్యేక కథనం..
తల్లిదండ్రుల ఆశలే ఆసరాగా..
విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 851 ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రాథమిక పాఠశాలలు 328, ప్రాథమికోన్నత 237, ఉన్నత పాఠశాలలు 286 ఉన్నాయి. ఈ పాఠ శాలల్లో 1,55,337 మంది విద్యార్థులు చదువుతున్నట్లు లెక్కలు చెబుతున్నా యి. అనధికారకంగా మరో 500 పాఠశాలలకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రైవేటు స్కూ ళ్లల్లో ఉత్తమ విద్య అందుతుందనే భావనతో వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న భావంతో అప్పులు చేసి మరి చదివిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న కార్పొరేటు సంస్థలు దోపిడీకి తెరలేపాయి. ఒక్కో పాఠశాల ఒక్కో విధంగా పీజులు నిర్ణయించి తల్లిదండ్రుల నుంచి గుంజుకుంటున్నాయి. ఫీజులను నియంత్రిచాల్సిన అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు.
ఏటా రూ.400 కోట్ల వ్యాపారం
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల ద్వారా ఏడాదికి రూ. 400 కోట్లుకు పైగా వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు వివిధ పాఠశాలల్లో వివిధ రకాల ధరలు నిర్ణయించారు. రూ. 20వేల నుంచి రూ.1.75 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ధనికుల నివసించే ప్రాంతాల్లో ఆ ధర మరింత ఎక్కువుగా ఉం టుంది. బస్సు చార్జీలను ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. అవికూడా 5 కిలోమీటర్లు లోపు రూ.5 వేల నుంచి 11వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈలెక్కన ఒక్కో విద్యార్థికి సరాసరి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు.
చెక్కులు వసూలు చేస్తున్నారు..
జిల్లాలోని ఓ కార్పొరేట్ స్కూల్ వారు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి టరమ్ ఫీజుల పేరుతో ముందస్తుగా చెక్కులను తీసుకుంటున్నారు. ముం దే ఎందుకు అని అడిగితే.. తమ స్కూల్‌లో అంతేనని తేల్చిచెబుతున్నారు. ముందుగా సమాచారం పంపుతామని, ఆ తర్వాతే బ్యాంకులలో చెక్కులను వేస్తామని తాపీగా సమాధానమిస్తున్నారు. సగం ఫీజు చెల్లిస్తేగాని అడ్మిషన్ నంబరు, బుక్స్ ఇవ్వని యాజమాన్యం చెక్కుల దందాకు తెరలేపడంతో తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రైవేటు ధనదాహం
Published Sat, Sep 26 2015 3:17 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement