సాక్షి, విజయవాడ: ప్రజల్లో రిజిస్ట్రేషన్‌పై ఉన్న అపోహలను నివృత్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జయలక్ష్మి సూచించారు. ఆమె సోమవారం గాంధీనగర్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం అమల్లోకి వస్తోందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకొని సేవలు పొందవచ్చన్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా సమయం ఆదాతో పాటు, పారదర్శక సేవలు అందుతాయని జయలక్ష్మి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌కు ఏ సమయంలో ఎవరు రావాలో స్లాట్ బుకింగ్ ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment