చిత్తూరు : అనంతపురం జిల్లాలో పల్లె వెలుగు బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం మారుగానిపల్లె వద్ద శుక్రవారం ఉదయం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా బస్సు ఈరోజు తెల్లవారుజామున కర్ణాటక నుంచి మారుగానిపల్లె వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హఠాత్తుగా బస్సు ముందు చక్రాలు ఊడిపోయి అనంతరం కల్వర్టును ఢీకొని కాల్వలో పడినట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్లో లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలో పల్లె వెలుగు బస్సు బోల్తా
Published Fri, Jan 9 2015 8:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement