నీచ రాజకీయాలు వద్దు | stop worst politics,says roja | Sakshi
Sakshi News home page

నీచ రాజకీయాలు వద్దు

Published Wed, Sep 17 2014 3:38 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

నీచ రాజకీయాలు వద్దు - Sakshi

నీచ రాజకీయాలు వద్దు

నగరి : జాతర గొడవల్లో తాను కులదూషణ చేసినట్లు టీడీపీ నాయకులు అనవసరంగా రాద్దాంతం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. మంగళవారం ఆమె విలేకరితో మాట్లాడారు. కుల దూషణ చేసే తత్వం తనది కాదన్నారు. వీడియో క్లిప్పిం గులు పరిశీలించినవారికి నిజం తెలుస్తుందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే కులదూషణ చేసినట్లు బూటకపు మాటలు చెబుతూ పబ్బంగడుపుతున్నారన్నారు. జాతరలో దేవతల హారతికి వచ్చాను తప్ప, తొలి హారతి ఇవ్వాలని తాను అడగలేదన్నారు. హారతి కోసం వచ్చిన తనపై అపవాదు వేయడం సబబుకాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement