పుట్లూరు, న్యూస్‌లైన్: విద్యార్థిని చితకబాదాడంటూ పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న అతని తల్లిదండ్రులు సర్ది చెప్పబోయిన మరో ఉపాధ్యాయునిపై దాడి చేసిన సంఘటన పుట్లూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరుకు చెందిన ఆంజనేయులు అనే విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులను అడ్డపేర్లతో పిలుస్తున్నాడని తోటి విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు రామమూర్తి విద్యార్థిని చితకబాదాడు.
దీంతో అతని చేతులు వాచిపోయాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. వీరికి నచ్చజెప్పేందుకు వెళ్లిన ఇంగ్లీషు ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఇద్దరిదీ తప్పు ఉండడంతో కేసు వద్దంటూ చివరికి రాజీ అయ్యారు.
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
Published Thu, Oct 24 2013 2:50 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement