సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం కాకినాడ సూర్యకళామందిరంలో జిల్లా జరిగింది. పార్టీ పరిశీలకులుగా హాజరైన జలవనరుల మంత్రి, జిల్లా ఇన్‌చార్జిమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, బి.బ్రహ్మయ్య నాయుడు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. పార్టీ కన్వీనర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబును అధ్యక్షుడిగా ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. పారీ ప్రధాన కార్యదర్శిగా శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి పేరూరు సర్పంచ్ పెచ్చెట్టి చంద్రమౌళిని ఎన్నుకొన్నారు. అనంతరం పార్టీ జిల్లా కమిటీని 70 మందితో ఏర్పాటుచేశారు. ఐదుగురు ఉపాధ్యక్షులు, 15 మంది వంతున సెక్రటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఒక ప్రచార కార్యదర్శి, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఒక కార్యాలయ కార్యదర్శి, మరో 40 మంది కార్యవర్గ సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.
అనుబంధ కమిటీల సారథులు వీరే..
అలాగే అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు. తెలుగురైతు అధ్యక్షుడిగా కందుల కొండయ్యదొర, ప్రధాన కార్యదర్శిగా గంగుమళ్ల సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడిగా కటకంశెట్టి సత్యప్రభాకర్(బాబీ), ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా గుత్తుల అచ్చాయమ్మ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా గ్రంది బాబ్జీ, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా నక్కా రాజబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎలుబంటి రాఘవరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షునిగా రాచపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా దండుప్రోలు నాగబాబు, బీసీ సెల్ అధ్యక్షుడిగా గుత్తుల రమణ, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా కాశి పరివాజ్‌కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా తాజుద్దీన్, సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా తోట ఆనందరాావును ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ మాదిరిగానే అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అనంతలక్ష్మి దంపతుల అలక!
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, ఇంతవరకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పిల్లి సత్యనారాయణ(సత్తిబాబు) ఈ ఎన్నికల సమావేశానికి దూరంగా ఉన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదరి పదవిని తనకు కాక చంద్రమౌళికి కట్టబెట్టారని సత్తిబాబు అలక వహించారనే ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ సమావేశానికి హాజరు కాకపోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంలో హెలిపాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని అవమానించినా పార్టీ నేతలు పట్టించుకోలేదనే కారణంతో సత్తిబాబు దంపతులు జిల్లా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఎమ్మెల్యేల మాటలతో కార్యకర్తల అయోమయం
కాగా, కార్యవర్గ ఎన్నిక సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు తలో రకంగా మాట్లాడి కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టేశారు. బీజేపీతో పొత్తు కేవలం ప్రగతి కోసమేగాని, రాజకీయాలు చేయడానికి కాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి, ప్రభుత్వ పథకాల్లో సాంకేతిక లోపాలను పార్టీ కార్యకర్తలే విమర్శించడం తగదని మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నమాటలు కార్యకర్తలను అయోమయూనికి గురిచేశాయి. కార్యకర్తలు ప్రభుత్వ పనుల్లో ఎన్ని లోపాలున్నా కప్పిపుచ్చాలేగాని విమర్శించవద్దన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, జడ్పీై చెర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, ఎస్‌వీఎస్ వర్మ, పెందుర్తి వెంకటేష్, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బాబు, ఎమ్మెల్సీలు కేవీవీ రవికిరణ్, బొడ్డు భాస్కరరామారావు, పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ‘దేశం’అధ్యక్షునిగా పర్వత
Published Tue, May 19 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement