చీపురుపల్లిలో ఉద్రిక్తత | tention situation in cheepurupally | Sakshi
Sakshi News home page

చీపురుపల్లిలో ఉద్రిక్తత

Published Wed, Jan 21 2015 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

tention situation in cheepurupally

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణాలను కూల్చి వేసేందుకు యంత్రాంగం యత్నించటమే ఇందుకు కారణం. చీపురుపల్లిలో రెండేళ్ల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని దుకాణాలను కూల్చివేశారు. దీంతో దుకాణదారులు ప్రభుత్వ స్థలంలో సొంత డబ్బుతో మళ్లీ దుకాణాలను నిర్మించుకున్నారు.

అది ప్రభుత్వ స్థలం కావటంతో ఐ.రాంబాబు అనే టీడీపీ నేత హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉదయం దుకాణాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులతో కలసి అధికారులు వెళ్లగా దుకాణాలను మూసివేసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దుకాణ దారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement