భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ నుంచి మంటలు | underground power cables catches fire in vijayawada | Sakshi
Sakshi News home page

భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ నుంచి మంటలు

Published Tue, Aug 22 2017 1:58 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

underground power cables catches fire in vijayawada

విజయవాడ : విజయవాడ నక్కల రోడ్డులో భూగర్బ విద్యుత్ వైర్లలో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు రోడ్డు నుంచి నక్కల్ రోడ్డుకు వెళ్లే జంక్షన్‌లో ఓ విద్యుత్ స్తంభం నుంచి పక్కనే వున్న కమర్షియల్ కాంప్లెక్స్‌ వరకు భూగర్భ విద్యుత్ లైన్ ఉంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు బయటకు వచ్చాయి.
 
ఆ సమయంలో రోడ్డుపై నడిచి వెడుతున్న రాజ్యలక్ష్మి అనే మహిళ మంటల బారిన పడి గాయపడింది. వెంటనే స్థానికులు మహిళను కాపాడారు. రోడ్డు మీద విద్యుత్ ప్రసారం జరుగుతోందంటూ అధికారులకు స్థానికులు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. రోడ్డుపై వెళ్లే వారు ఏం జరుగుతున్నదో తెలియక భయభ్రాంతులకు గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement