ఏలూరు : జిల్లాలో ఐదువేల మంది చేనేత కార్మికులకు మహాత్మాగాంధీ బంకర్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. తన చాంబర్‌లో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు తీరుపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీమా యోజనకు ఇప్పటివరకూ 3,390 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పా రు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో భాగస్వాముల్ని చేయాలని చేనేత, ఔళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో 3,094 మంది వృద్ధ చేనేత కార్మికులు పింఛను పొందుతున్నారని, 569 మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
అంత్యోదయ అన్నయోజన కింద 160 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతుండగా, మరో 164 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వారికి ఆ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో 340 మంది చేనేత కార్మికులు సంఘంగా ఏర్పడి చేనేత వస్త్రాలను ఉత్ప త్తి చేసేందుకు ముందుకొచ్చారన్నారు. వా రికి ప్రభుత్వం రూ.49 లక్షలు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా యంత్రాలకు రూ.16.32 లక్షలు విడుదల చేసినట్టు చెప్పారు. ఉత్పత్తి ప్రారంభించిన తరువాత మిగిలిన సొమ్ము మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 15 చేనేత ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రూ.62.64 లక్షలను సాయంగా అందించామని పేర్కొన్నారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి వీవర్స్ సొసైటీలకు సబ్సిడీపై నూలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 800 చేనేత కార్మిక కుటుంబాలకు వ్యక్తిగత రుణాలు అందించేందుకు వీవర్స్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నామన్నారు. 2014-15 సంవత్సరానికి 300 మందికి హ్యాండ్లూమ్ వీవర్స్ త్రిఫ్ట్ ఫండ్ అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.
ఆధునాతన డిజైన్లలో శిక్షణ
తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో ఏర్పాటు చేసిన నైపుణ్యం అభివృద్ధి కేం ద్రాల్లో 250 మంది చేనేత కార్మికులకు శిక్షణ అందించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. సంప్రదాయ వస్త్రాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధునాతన డిజైన్లతో వస్త్రాలు ఉత్పత్తి చేసేవిధంగా శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ, చేనేత, ఔళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డి.పవన్‌కుమార్, వీవర్స్ సొసైటీ సెంటర్ ఉప సంచాలకులు వి.నాట్యాల్, డీసీఏవో వి.త్రిమూర్తులు, ఆప్కో సహాయ మార్కెటింగ్ అధికారి టి.కోటేశ్వరరావు, ఎల్‌ఐసీ విజ యవాడ సీనియర్ బ్రాంచి మేనేజర్ బి.గోపీప్రసాద్, ఐసీఐసీఐ కో-ఆర్డినేటర్ ఐ.ఏడుకొండలు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు బీమా యోజన
Published Sun, Oct 26 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement