చుండుపల్లె: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వైఎస్సార్ జిల్లా చుండుపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన జొన్నలగడ్డ చిరంజీవి, రెడ్డెమ్మలకు వివాహమై నాలుగేళ్లయింది. తరచూ వారి మధ్య కలతలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే గురువారం వేకువజామున ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
Published Thu, Aug 13 2015 2:12 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement