ఆ మూడు రంగాల్లో పురోగతే అసలైన మహిళా సాధికారత | YS Jagan wishes to International Womens Day | Sakshi
Sakshi News home page

ఆ మూడు రంగాల్లో పురోగతే అసలైన మహిళా సాధికారత

Published Fri, Mar 8 2019 1:20 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

YS Jagan wishes to International Womens Day - Sakshi

సాక్షి, అమరావతి: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధికారత సాధించినప్పుడే మహిళల నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

‘బ్యాలెన్స్‌ ఫర్‌ బెటర్‌’ అనే ఉదాత్తమైన భావనతో జరుగుతున్న మహిళా దినోత్సవం ఆశయాలను ప్రతిబింబించేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని  తెలిపారు. పార్టీ ఇప్పటికే రూపొందించి ప్రకటించిన నవరత్నాలు కార్యక్రమంలోనూ, పార్టీ ఇతర కార్యక్రమాల్లోనూ మహిళల సామాజిక, ఆర్థిక రాజకీయ సాధికారతను పెంపొందించేలా చర్యలు తీసుకున్నామని జగన్‌ పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement