'విశాఖ'లో 'పోరుబాట'
విశాఖపట్నం: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు...
నగరంలోని సీతమ్మదారలో పార్టీ జిల్లా కన్వీనర్ గుడివాడ అమర్నాథ్ ఆధర్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గొల్లబాబురావు, తైనాల విజయ్కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, మళ్ల విజయ్ ప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, కోలా గురువులు చొక్కాకుల వెంకట్రావు, మహిళ కన్వీనర్ ఉషా కిరణ్ పాల్గొన్నారు.
కోటవరుట్ల: సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో ధర్నా
దేవరపల్లి, కె.కోటపాడు: ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా
చోడవరం: మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో ధర్నా
నర్సీపట్నం: ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ధర్నా
నక్కపల్లి: వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా
అచ్యుతాపురం: ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన
పాయకరావుపేట: మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.