హుడ్కో రుణ మంజూరు రూ.30,774 కోట్లు
న్యూఢిల్లీ: హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హుడ్కో) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.30,774 కోట్ల రుణాల్ని మంజూరు చేసింది. రుణ పంపిణీలు రూ.8,250 కోట్లని హుడ్కో ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.782 కోట్ల నికర లాభం ఆర్జించామని తెలిపింది. కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి మొత్తంగా 17,000 హౌసింగ్, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటునందించామని పేర్కొంది. తాము ఎంఓహెచ్‌యూపీఏతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా గత ఆర్థిక సంవ త్సరానికి గానూ వరుసగా ఐదోసారి ఎక్సలెంట్ రేటింగ్‌ను పొందే అవకాశముందని తెలిపింది. తొలిసారి స్టాండ్ అలోన్ బేసిస్ ప్రాతిపదికన మూడు దిగ్గజ రేటింగ్ ఏజెన్సీల నుంచి ఏఏఏ రేటింగ్‌ను పొందామని తెలిపింది.