న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్.. భారత మార్కెట్లో శుక్రవారం రెండు అధునాతన బైక్‌లను విడుదలచేసింది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ గ్రూపునకు చెందిన ఈ సంస్థ.. ‘ఆర్ 1250 జీఎస్, ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్’ పేర్లతో శక్తివంతమైన ఇంజిన్ కలిగిన బైక్‌లను మార్కెట్లోకి తెచ్చింది.
శుక్రవారం నుంచే డీలర్ల వద్ద బుకింగ్స్ పూర్తిచేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. 1,254సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వీటి ధరల శ్రేణిని రూ.16.85 లక్షలు– రూ.21.95 లక్షలుగా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment