20 గంటల్లో 13 లక్షల స్మార్ట్‌ఫోన్ల విక్రయం
20 గంటల్లో 13 లక్షల స్మార్ట్‌ఫోన్ల విక్రయం
Published Fri, Sep 22 2017 12:10 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
సాక్షి, బెంగళూరు : పండుగ ఫెస్టివల్ సేల్‌లో ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ దూసుకుపోతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్, గ్రేట్ ఇండియన్ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో దుమ్మురేపుతున్నాయి. ఈ రెండు దిగ్గజాలు రెండో రోజు విక్రయాలు గతేడాది కంటే రెండింతలు పైగా తమ సేల్స్‌ను పెంచుకున్నట్టు తెలిపాయి. తొలి 20 గంటల్లో 13 లక్షల స్మార్ట్‌ఫోన్లను అమ్మినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సంఖ్య గతేడాది కంటే రెట్టింపని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ సేల్స్ డేలో గతేడాది సింగిల్ డే రోజు మొత్తం రూ.1,400 కోట్ల అమ్మకాలను ఫ్లిప్‌కార్ట్ చేపట్టింది.
బుధవారం బిగ్ బిలియన్ డే ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మార్కెట్ షేరులో 65 శాతం సంపాదించినట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ కేటగిరీ 75 శాతంగా చెప్పింది. మరోవైపు అమెజాన్ కూడా తన స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో ఎక్కువ వృద్ధి ఉన్నట్టు తెలిపింది. గతేడాది దీపావళి కంటే 100శాతం పెంపును చూస్తున్నామని అమెజాన్ అధికార ప్రతిధి చెప్పారు. ఆన్‌లైన్ కంపెనీలు జరుపుతున్న సేల్స్‌ను ట్రాక్ చేసిన విశ్లేషకులు, గురువారం నాటికి స్థూల సరుకుల విలువ(జీఎంవీ) రూ.2500 కోట్లను అధిగమించినట్టు పేర్కొన్నారు.
మొత్తంలో డే-1 విక్రయాల్లో రూ. 1000 కోట్ల జీఎంవీలు నమోదైనట్టు రెడ్‌షీర్ సీఈవో అనిల్ కుమార్ తెలిపారు. బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్లు, రెడ్‌మి నోట్ 4, శాంసంగ్ ఎస్7, ఎస్8 లు నిలుస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ స్మృతి రవి చంద్రన్ తెలిపారు. రెండు ప్లాట్‌ఫామ్‌లు డీల్స్‌ను ఒకే విధంగా ఉండటానికి కొన్ని ఉత్పత్తులపై ధరలను కూడా మార్చేశాయి.
Advertisement