గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం బుధవారం భారీగా పతనమైంది. ఉదయం 10:15 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.734 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.46,395 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 20 డాలర్లు తగ్గి ఔన్స్ బంగారం 1,728.60 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ అంతర్జాతీయ ఈక్విటి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌అవుతుండడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల పై దృష్టిపెట్టడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అదనంగా 500 బిలియన్ల యూరోలను ప్రకటిస్తుందని పెట్టుబడిదారులు అంచనావేస్తున్నారు. అంతేగాకుండా డాలర్ ఇండెక్స్ 0.2శాతం తగ్గి రెండు నెలల కనిష్టానికి చేరడం కూడా పసిడి ధరలు తగ్గుదలకు దోహదం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment