రెండురోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు గురువారం రూ.46 వేల వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.278 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.46,117 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 23 డాలర్లు తగ్గి ఔన్స్ బంగారం 1,705.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌అవ్వడం, బలపడతున్న ఈక్విటీ మార్కెట్లు, దేశీయంగా ఆర్థిక రికవరిపై అంచనాలు వంటి కారణాలతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment