హైదరాబాద్: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ లెవల్ ఉద్యోగ నియామకాలను తగ్గించునున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎక్కువ జీతాలను ఆశించే సీనియర్ ఉద్యోగులకు ఈ సంవత్సరం నిరాశ తప్పదని తెలుస్తోంది. నైపుణ్యం కలిగిన ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే సంస్థ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ నిపుణులు విశ్లేస్తున్నారు. ఇన్పోసిస్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఎంట్రీ లెవల్(ప్రారంభ స్థాయి), ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది.
ప్రస్తుత సంవత్సరంలో ఇన్పోసిస్ 150 మిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించనున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభంలో సంభవించిన వ్యాపార నష్టాలు, ఖర్చులు తగ్గించుకునే క్రమంలో సంస్థ ఉద్యోగులను కుదించుకోవాలని చూస్తోంది. అయితే ఖర్చును తగ్గించుకోవడానికి సీనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 2019 సంవత్సరంలో ఉన్నతస్థాయి ఉద్యోగులు 7శాతం పెరగగా, సీనియర్ లెవల్ ఉద్యోగులు 11శాతం, మిడిల్ లెవల్ ఉద్యోగులు 25శాతం అధికంగా సిబ్బందిని నియమించుకున్న విషయం తెలిసిందే. దేశ టెక్నాలజీ రంగంలో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. చదవండి: ఇన్ఫోసిస్‌లో ఎగిసిన కరోడ్‌పతి ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment