కార్బన్ మొబైల్స్ ఆఫర్ | Karbonn offers affordable smartphones for women | Sakshi
Sakshi News home page

కార్బన్ మొబైల్స్ ఆఫర్

Published Mon, Mar 7 2016 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

కార్బన్ మొబైల్స్ ఆఫర్

కార్బన్ మొబైల్స్ ఆఫర్

న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ కార్బన్.. మగువలకు ఆఫర్ ప్రకటించింది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను మంగళవారం వనితలకు తక్కువ ధరలకు అందిస్తున్నట్టు తెలిపింది. క్వాట్రో ఎల్ 50 హెచ్ డీ రూ.7999, టిటానియం మాచ్ ఫైవ్ రూ. 5999, టిటానియం మొఘల్ రూ.5790, కే9 స్మార్ట్ ఫోన్ ను రూ.3999లకు విక్రయించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవలే విడుదల చేసిన క్వాట్రో ఎల్ 50 హెచ్ డీ స్మార్ట్ ఫోన్ తో వినియోగదారులకు స్థిరమైన, సురిక్షిత 4జీ అనుభవం సొంతమవుతుందని తెలిపింది. 127 సెంటీమీటర్ల హెచ్ డీ ఐపీఎస్ ఫుల్ లామినేషన్ స్క్రీన్, 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఆన్-బోర్డ్ మెమొరీ, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాఫిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయని కార్బన్ మొబైల్స్ సంస్థ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement