హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ద్వితీయ త్రైమాసిక ఆదాయం పెరిగినా, నికర లాభంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. ఈ మూడు నెలల కాలానికి రూ. 205 కోట్ల ఆదాయంపై (స్టాండ్ ఎలోన్) రూ. 34.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు బాగున్నా.. ఉత్తర అమెరికా ఎగుమతులు ఆలస్యం కావడం లాభాలు తగ్గడానికి కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 194 కోట్ల ఆదాయంపై రూ. 34.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
సమీక్షా కాలంలో కన్సాలిడేటెడ్ లాభం రూ. 32 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు తగ్గింది. రానున్న త్రైమాసికాల్లో లాభాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. రూ. 10 ముఖ విలువ కలిగిన షేరును రూ.2గా విభజించడానికి శుక్రవారం సమావేశమైన బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి రికార్డు తేదీ నవంబర్ 28గా నిర్ణయించారు. దీని ప్రకారం నవంబర్ 28 నాటికి షేర్లు కలిగిన వాటాదారులకు ప్రతీషేరుకు 5 షేర్లు వస్తాయి.
షేర్ల విభజనకు నాట్కో ఆమోదం
Published Sat, Nov 14 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM
Advertisement