ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
భువనేశ్వర్ : ఒడిషా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డియర్ ఎలవెన్స్ (డీఏ) ను భారీగా పెంచింది. ఆరు శాతం డీఎ ను పెంచుతున్నట్లు ప్రకటించింది . ప్రస్తుతం ఉన్న డీఎను 119 నుంచి 125 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. ఈ ఏడాది జనవరినుంచి దీన్ని అమలు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రదీప్ అమత్ తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమోదం తెలిపారన్నారు.
ఈ తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వంపై సుమారు 668 కోట్ల రూపాయల భారం పడనున్న్టట్టు వెల్లడించారు. తమ నిర్ణయం మూలంగా లక్షలాది మంది నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, మూడు లక్షలమంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. నాలుగు నెలల బకాయిలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాపై 789.72 కోట్ల రూపాయల భారం పడనుందని ఆయన తెలిపారు .