సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. వరుసగా మూడో రోజుకూడా ప్రతికూలంగానే ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. అమ్మకాల ఒత్తిడితో కీలక సూచీలు రెండూ మద్దతుస్థాయిలు కిందికి చేరాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 33 వేల దిగువకు పడిపోవడం గమనార్హం. సెన్సెక్స్ 87 పాయింట్ల నష్టంతో 32,855 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు క్షీణించి 10.159 వద్ద కొనసాగుతున్నాయి. ప్రయివేట్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ సెక్టార్లు నష్టపోతున్నాయి. ఐటీ స్వల్పంగా లాభాల్లో ఉంది.
హిందాల్కో, వేదాంతా, టాటా స్టీల్, గెయిల్, ఓఎన్‌జీసీ, సన్ పార్మా, లుపిన్, యస్‌బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం నెగిటివ్‌గా, బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, జెట్ ఎయిర్‌వేస్ పాజిటివ్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment