![Man Died In Road Accident In Yadadri - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/13/man-dead-body.jpg.webp?itok=_L7ulHQl)
వీరయ్య మృతదేహం
చింతపల్లి(దేవరకొండ) : పరువు పోతుందని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చింతపల్లి మండలంలోని మాల్ వెంకటేశ్వరనగర్ బస్టాండులో గురువారం జరిగింది. ఎస్‌ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన వీరయ్య(24) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ మద్యం సేవించి పరిసర ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.
ఈ విషయం వీరయ్య బంధువులకు తెలియడంతో ఎక్కడికెళ్లినా పరువు పోతుందని మనస్తానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఈనెల 11న రాత్రి వెంకటేశ్వరనగర్ బస్టాండు వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా ఇబ్రహీంపట్నం తరలించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment