పాత పోస్టాఫీసు (విశాఖపట్నం): జీఎస్టీ నకిలీ ఇన్‌వాయిస్ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం (డీజీజీఐ) సంయుక్త సంచాలకుడు మయాంక్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణ రంగానికి చెందిన మేనేజింగ్ డైరెక్టర్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. కంపెనీ పేరిట ఎటువంటి సేవలు అందించకుండానే రూ.450 కోట్ల విలువైన నకిలీ ఇన్‌వాయిస్‌లను విడుదల చేసినట్టు మయాంక్ శర్మ పేర్కొన్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పట్టుకున్నామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment