సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ తమ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు అమ్ముతూ డబ్బులు దండుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. నెక్లెస్ రోడ్డులోని బైద బే వాటర్ ఫ్రంట్ బార్ అండ్ రెస్టారెంట్.. 20 రూపాయల కిన్లే వాటర్ బాటిల్‌ను 207 రూపాయలకు అమ్ముతోంది. అంతేకాకుండా 99 రూపాయల రెడ్‌బుల్ ఎనర్జీ డ్రింక్‌ను 209 రూపాయలకు అమ్ముతోంది. ప్రతి పెగ్గుపై 11శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తూ మందు బాబుల పొట్టకొడుతోంది. అలా ప్రతి 1336 రూపాయల బిల్లులో 147 రూపాయల మోసానికి పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన తూనికలు కొలతల శాఖ అధికారులు సదరు రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించి, మూడు కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment