గుంటూరులో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ | 3 years old boy kidnapped | Sakshi
Sakshi News home page

గుంటూరులో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్

Published Sat, May 7 2016 5:03 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

3 years old boy kidnapped

గుంటూరు : నగరంలోని ఊరావారివీధిలో శనివారం మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. చిన్నబజార్‌కు చెందిన గుడివాడ శివనాగేశ్వరరావుకు ఊరావారివీధిలో రెండు బట్టల దుకాణాలున్నాయి. ఒకటి భవానీ కిడ్స్‌వేర్ కాగా.. మరొకటి శ్రీ సుబ్బలక్ష్మి టెక్స్టైల్స్. నాగేశ్వరరావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సరోజినికి ఇద్దరు కూతుళ్లు. వారికి పెళ్లిళైపోయాయి. రెండవ భార్య సుభాషిణికి పిల్లల్లేరు. ఓ బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది.

అయితే శనివారం మధ్యాహ్న సమయంలో బాలుడు రేవంత్ సాయికుమార్(3) భవానీ కిడ్స్ వేర్‌లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కిడ్నాప్ చేసి బైక్‌పై పరారయ్యాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలాన్ని అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు పరిశీలించారు. మొదటి భార్య అల్లుళ్లే కిడ్నాప్ చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement