బ్యాం‘కింగ్’..శ్యాంచరణ్‌రెడ్డి..! | Adilabad youth shyam charan reddy got plenty of jobs in banking sector | Sakshi
Sakshi News home page

బ్యాం‘కింగ్’..శ్యాంచరణ్‌రెడ్డి..!

Published Fri, Apr 1 2016 8:44 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Adilabad youth shyam charan reddy got plenty of jobs in banking sector

ఆదిలాబాద్ టౌన్: ఉన్నవాడిదే అదృష్టమన్నట్లు, ప్రతిభావంతుడైన యువకుడు రాసిన పరీక్షలన్నీ పాసై, ఏకంగా ఎనిమిది ఉద్యోగాలు సాధించాడు. గడిచిన ఏడాది కాలంగా వివిధ బ్యాంక్ పరీక్షలు రాసిన ఆదిలాబాద్ యువకుడు శ్యాంచరణ్ రెడ్డి అన్నింటా విజయం సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయ దంపతులు ప్రకాశ్‌రెడ్డి, పద్మల తనయుడు శ్యాంచరణ్  ఏడాది కాలంలో ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీజీబీ, ఏపీజీవీవీ తదితర బ్యాంకుల పరీక్షల్లో ప్రతిభ చూపి క్లరికల్ పోస్టుకు అర్హత సాధించాడు. టీజీబీ, ఏపీజీవీవీ, బ్యాంక్ ఆఫ్ బరోడా పీవో పరీక్షల్లోనూ ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం టీజీబీలో పీవో ఉద్యోగంలో చేరి పని చేస్తున్నాడు. శుక్రవారం విడుదలైన ఐబీపీఎస్ బ్యాంకు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో పీవోగానూ సెలెక్టయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement