బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం | Budget injustice to AP | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం

Published Fri, Feb 3 2017 10:53 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం - Sakshi

బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం

  • టీడీపీ ఎంపీలు స్వాగతించడం దారుణం
  • బడ్జెట్‌ పత్రాలను కాల్చివేసి.. కాంగ్రెస్‌ నేతల నిరసన
  • నెల్లూరు సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి,  ప్రధాన కార్యదర్శి చెంచలబాబుయాదవ్‌ మండిపడ్డారు. నగరంలోని ఇందిరాభవన్‌ ఎదుట కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను గురువారం కాల్చివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురూ మాట్లాడుతూ ప్రత్యేకహోదా అంశం గురించి కానీ, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయం కానీ ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    విశాఖ రైల్వే జోన్‌అంశం, దుగరాజుపట్నం, నడికుడికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. ఈ బడ్జెట్‌ను టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో స్వాగతించడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు భవానీ ప్రసాద్, పత్తి సీతారాంబాబు, ఆసిఫ్‌బాషా, శివాచారీ, ఫయాజ్,లతారెడ్డి, బాలసుధాకర్, లతారెడ్డి, అమీనా, మూలంబాస్కర్‌ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement