రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...డ్రైవర్ల దుర్మరణం | buses accident drivers died in chittoor | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...డ్రైవర్ల దుర్మరణం

Published Mon, Nov 23 2015 3:10 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

buses accident drivers died in chittoor

చిత్తూరు జిల్లా :  చిత్తూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును, శ్రీకాళహస్తి నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లు ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బస్సుల్లో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో ఆ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement