తెగిపడ్డ విద్యుత్ వైర్లు.. మూగజీవాలు మృతి
Published Mon, Jul 25 2016 12:40 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
బొమ్మలరామారం: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. జిల్లాలోని బొమ్మల రామారం మండలం బండకాడిపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని స్థానికులు గమనించకపోవడంతో.. అటుగా వెళ్లిన 8 గేదెలు, ఒక ఆవు, రెండు నక్కలు మృతి చెందాయి. పశువులు మృతి తో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేసి మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement