చెన్నై ఎగ్మోర్ రైలు రద్దు
Published Tue, Dec 13 2016 9:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
- ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు
కర్నూలు(రాజ్‌విహార్): చెన్నైలో వర్దా తుపాను బీభత్సం నేపథ్యంలో చెన్నై ఎగ్మోర్(17652) రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ రైలు కాచిగూడలో సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి కర్నూలుకు ప్రతి రోజు రాత్రి 8.10 గంటలకు వచ్చి వెళ్తుంది. అయితే వర్దా తుపాను కారణంగా మంగళవారం రావాల్సిన రైలును పూర్తిగా రద్దు చేశారు. తుపాను తీవ్రత తగ్గుముఖం పడుతున్న కారణంగా ఈ రైలుకు బదులు అర్ధరాత్రి ఒంటి గంటకు కాచిగూడలో ప్రత్యేక రైలును నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అ«ధికారులు తెలిపారు.
Advertisement