బత్తలపల్లి : బత్తలపల్లిలో ఓ పెంపుడు కుక్క బీభత్సం సృష్టించింది. మండలంలోని గంటాపురానికి చెందిన జాంపుల చంద్రమోహన్ బత్తలపల్లిలో లారీ ట్రాన్స్‌పోర్ట్ సప్లయ్ ఆఫీసు పెట్టుకున్నారు. ఆయన పెంపుడు కుక్క గురువారం సాయంత్రం ఇంటి కాంపౌండ్‌లో నుంచి తప్పించుకుంది. అంతటితో ఆగక ఊరి కుక్కలను ఐదింటిని కొరికి చంపింది. విషయం తెలుసుకున్న యజమాని దాన్ని కట్టేసే ప్రయత్నం చేయగా అతనిపైనా దాడి చేసి కరిచింది. వీపు, చేతులు కొరకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.