ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
Published Thu, Sep 29 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
పాన్‌గల్: జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని టీపీఆర్‌టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చింతకుంట, మాందాపూర్, బుసిరెడ్డిపల్లి, కల్వరాల, కేతేపల్లి, పాన్‌గల్ ఉన్నత పాఠశాలల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో 2048 ఖాళీ పోస్టులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం 2200 కలిపి మొత్తం 4248 ఉపాధ్యాయ పోస్టులు అవసరమవుతాయన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్, పీఆర్‌సీ బకాయిలు, పదోన్నతులు, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన తదితర సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు విష్ణు, నాగేశ్వర్‌రెడ్డి, నాగరాజు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement