- దర్శకుడు వంశీ
కోనసీమలో త్వరలో షూటింగ్
Published Tue, Dec 20 2016 11:48 PM | Last Updated on Tue, Oct 2 2018 3:08 PM
మోరి (సఖినేటిపల్లి) :
కోనసీమలో త్వరలో స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ‘ఫ్యాష¯ŒS డిజైనర్ స¯ŒSఆఫ్ లేడీస్ టైలర్’ చిత్రం షూటింగ్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రముఖ చిత్ర దర్శకుడు వంశీ పేర్కొన్నారు. మంగళవారం స్మార్ట్ విలేజెస్‌గా ఎంపికైన మోరి, మోరిపోడు గ్రామాలను ఆయన సందర్శించారు. చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ఇప్పటికే పాపికొండలలో చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ నెల 27 నుంచి కోనసీమలో షూటింగ్ చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఆయా గ్రామాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు రానుందని చెప్పారు. మోరి చేనేత సొసైటీని ఆయన సందర్శించి, కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసించారు.
Advertisement
Advertisement